
తాడికొండ: ఈ నెల 27,28 వ తేదీల్లో జరిగే 48 గంటల మహా ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్య క్షులు దండా లక్ష్మినారాయణ అన్నారు. గురువారం తాడ ికొండ సినిమాహల్ వద్ద జరిగిన సిఐటియు మండల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మినారాయణ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరారు.8 గం టల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం వలన కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చాడానికి తప్ప కార్మికులకు ప్రయోజనం లేదన్నారు .కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ వలన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. 72 రకాల పరిశ్రమలలో పనిచేసే కార్మి కులకు స్కీం వర్కర్లకు పని భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలన్నారు. సాంకేతికత వలన పని భారం తగ్గాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పని భారం ఎక్కువైందని అన్నారు. ప్రభు త్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు. స్కీం వర్కర్లు అసంఘటిత కార్మికుల సమస్యల పరి ష్కారం కోసం పోరాటాలు చేయా ల్సిన పరిస్థితి వచ్చిం దని అన్నారు. కార్యక్రమంలో సిఐ టియు నాయకులు సాంబశివరావు, ఎడ్లపల్లి గాంధీ రామ్మోహనరావు, రైతు సంఘం నాయకులు కె.పూర్ణ చంద్రరావు, కె.స్రవంతి, సిహెచ్ భాస్కరరావు పాల్గొన్నారు.