Aug 17,2023 00:09
బంగారు పతకం సాధించిన విద్యార్థులతో భాష్యం ప్రిన్సిపాల్‌, సిబ్బంది

ప్రజాశక్తి-అద్దంకి: గుంటూరులో దేశ స్థాయిలో ఈ నెల 15వ తేదీ జరిగిన స్కేటింగ్‌ పోటీల్లో పట్టణంలోని బంగ్లా రోడ్‌లోని భాష్యం ఉన్నత పాఠశాలలో 8,6 తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక బంగ్లా రోడ్‌లోని భాష్యం ఉన్నత పాఠశాలలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్‌ జివిఎస్‌ఆర్‌ శాస్త్రి, హెచ్‌ఎం కాకాని కల్పన పాఠశాలలో గురువారం అభినందన సభ నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సోమవారం గుంటూరులోని రెయిన్‌ ట్రీట్‌ పార్క్‌లో శివగంగ స్కేటింగ్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బెల్గాం, స్కేటింగ్‌ కోచ్చేస్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వరంలో దేశ స్థాయిలో 5 గంటల పాటు నిర్విరామంగా స్కేటింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అద్దంకి భాష్యం ఉన్నత పాఠ శాలలో 8,6 తరగతుల విద్యార్థులు ఆరెపాక అఖిల్‌, బత్తినేని ప్రదీప్‌ చౌదరి పాల్గొని బంగారు పతకాలను సాధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలిపారు.