జాతీయస్థాయి క్రీడల్లో ఇద్దరికి స్వర్ణ, కాంస్య పతకాలు
ప్రజాశక్తి -మధురవాడ : గుజరాత్, అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు సత్తా చాటి, పతకాలను సాధించారు. గీతం క్రీడావిభాగం డైరెక్టర్ అరుణ్ కార్తీక్ తెలిపిన వివరాలివి. జాతీయ క్రీడాపోటీలకు . గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో బిఎ. సైకాలజీ సెకెండియర్ విద్యార్థిని రియాసాబూ ఫ్రీస్టైట్ స్కేటింగ్ (ఆర్టిస్టిక్)లో స్వర్ణపతకం సాధించింది. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తతీయ సంవత్సరం విద్యార్థిని భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించిందని అరుణ్‌కార్తీక్ తెలిపారు. జాతీయ స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచిన గీతం స్కేటర్లను గురువారం జరిగిన కార్యక్రమంలో వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, క్యాంపస్ లైఫ్ ప్రొ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి. గుణశేఖరన్ అభినందించారు.










