ప్రజాశక్తి-సీతమ్మధార : క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యాన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆదివారం క్షత్రియ కల్యాణ మండపంలో స్కాలర్‌షిప్ పంపిణీ చేశారు. 450 మంది విద్యార్థులకు సుమారు రూ.20 లక్షలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మల్లికార్జున ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక కమ్యూనిటీ ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ, చదువుకోవడానికి మార్గదర్శకంగా ఒక ప్లాట్ ఫామ్ దొరకడం మంచి అవకాశం అని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె రాజు, సెంచూరీయన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జిఎస్‌ఎన్.రాజు, కాశీ విశ్వనాధ్‌రాజు, దాట్ల కీర్తి, ఉష రాజు, 14వ వార్డు కార్పొరేటర్ కె.అనీల్ కుమార్‌రాజు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ దాట్ల తిరుపతిరాజు, డిఎస్‌పి వర్మ, కె.శ్రీహరిరాజు, ఎఎల్‌ఎన్.రాజు, ఎన్.శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.










