ప్రజశక్తి - చీరాల
నాయి బ్రాహ్మణ విద్యార్థులు, వికలాంగులు, క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగ, సాంస్కృతిక, సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ అందిస్తున్న స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని హైమ హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు కోరారు. స్థానిక హైమ హాస్పిటల్లో స్కాలర్షిప్ కరపత్రంను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చదువుకుందాం, చదివిద్దాం, చదువుకున్న సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు. సెప్టెంబర్ 24న ఆదివారం ఒంగోలు కాపు కళ్యాణ మండపం నందు 200మంది నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున స్కాలర్షిప్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన కరపత్రాన్ని, స్కాలర్షిప్ దరఖాస్తుని అందజేశారు. కార్యక్రమంలో నాదెండ్ల రాఘవ, పొతకమూరి మధుబాబు, అన్నవరపు వెంకటేశ్వర్లు, మార్కాపురం వెంకట రామారావు, పాతపాటి మధుబాబు, ముద్దుపాటి వెంకట్రావు, సుబ్బారావు పాల్గొన్నారు.










