Aug 26,2023 00:09

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు : cశుక్రవారం కలెక్టరేట్‌ నుండి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ, ఐసిడిఎస్‌ అధికారులతో ఓటరు నమోదు, నిత్యావసర సరుకులు పంపిణీ, రైతు భరోసా, పి.ఎం. కిసాన్‌ మంజూరు, రీ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో సరుకుల పంపిణీ సమస్యలను సిడిపిఓలను అడిగి తెలుసుకున్నారు. డీలర్లు సరుకుల పంపిణీలో జాప్యం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సిడిపిఓలు, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, డీలర్లు, ఎం. డి.యూ ఆపరేటర్లతో తహశీల్దారులు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.ఇంటింటి ఓటరు నమోదు సర్వే పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 సేకరణ సక్రమంగా చేయాలని చెప్పారు. ఓటరు ఫోటోలు ఉంటే పక్కాగా నిర్దారణ చేసుకుని తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. వి.ఆర్‌. ఓలు ఓటరు సర్వే ప్రక్రియలో పాల్గొనాలని తెలియజేసారు. వి.ఆర్‌ ఓల హాజరు వివిరాలను తప్పని సరిగా తహశీల్దారులు సమర్పించాలని పేర్కొన్నారు. ఎస్సైన్డ్‌ భూముల వివరాలు సేకరణ, నమోదు ప్రక్రయపై తహశీల్దారులు దృష్టి పెట్టాలన్నారు.అర్హత కలిగిన రైతులకు పి. ఎం. కిసాన్‌, రైతు భరోసా అందించాలని స్పష్టం చేసారు. అటవీ హక్కు పత్రాలు పొందిన రైతుల వివరాలను గిరి భూమి పోర్టల్‌లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. మ్యుటేషన్‌ ప్రక్రియలో లోపాలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. భూముల రీసర్వే వేగంగా పూర్తి చేయాలని తహశీల్దారులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్‌, రంపచోడవరం ఏపి ఓ.సూరజ్‌ గనోరే, డి ఆర్‌ ఓ అంబేద్కర్‌, జిల్లా వ్యవయాధికారి ఎస్‌.బి. ఎస్‌.నంద్‌, కలక్టరేట్‌ పరిపాలనాధికారి చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.