Oct 30,2023 23:05
పాఠశాలను పరిశీలిస్తున్న జిసిడిఒ ప్రమోద

ప్రజాశక్తి-పిసిపల్లి: సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించాలని జిసిడి ఎం ప్రమోద అన్నారు. సోమవారం ఆమె పిసిపల్లి కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలకు సకాలంలో సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేయాలని ఆమె అన్నారు. మంచి విజయాలు సాధించి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. భోజనం గురించి బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కేజీబీవీ ప్రిన్సిపల్‌ బి సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు.