సబ్ కలెక్టర్ శుభం బన్సల్
ప్రజాశక్తి మారేడుమిల్లి
ఏజెన్సీలోని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు సకాలంలో బియ్యం, నిత్యవసర సరుకులు అందజేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు సంబంధించిన తహశీల్దార్లు, ఎంపిడిఒలు, జిసిసి మేనేజర్లు, రేషన్ షాపుల డీలర్లు, ఎండియు వాహనాల డ్రైవర్లు, సివిల్ సప్లై అధికారులతో సబ్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా సివిల్ సప్లై అధికారి ఆర్.శివ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెల్లరేసన్ కార్డు లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటవ తారీఖు నుండి 22వ తారీకు వరకు ఎండియు వాహనాల ద్వారా బియ్యం ప్రతి ఇంటికి సరఫరా చేయాలని, లేకుంటే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపులో మూడో వారం సరుకుల రికవరీ వెంటనే డీడీలు తీసి సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం గణేష్ కుమార్, డివిజనల్ సివిల్ సప్లై అధికారి సి.శ్రీహరి, జిసిసి డిఎం పార్వతీశం, సీనియర్ మేనేజర్ ఎం.రాజారెడ్డి. తహశీల్దార్లు సుబ్రమణ్యం, వెంకటేశ్వరరావు, బి.రాజు. కె.సుధాకర్. వీరభద్రరావు, ఎంపీడీవోలు ఎంవిఆర్ కుమార్ బాబు, ఎం.బాపన్నదొర, వీర కిషోర్, రత్నకుమారి, అశోక్ తదతరులు పాల్గొన్నారు.










