
సజ్జల రామకృష్ణారెడ్డితో కదిరి నాయకులుసజ్జల రామకృష్ణారెడ్డితో కదిరి నాయకులు
ప్రజాశక్తి, కదిరి టౌన్ : బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ విజయవాడలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని గురువారం కలిశారు. ఈ సందర్భంగా వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, త్వరలో జరిగే బస్సు యాత్ర,బీసీ సమస్యలపైన జాగృతిక యాత్రలపై చర్చించినట్లు సమాచారం. అదే విధంగా కదిరి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో వైసిపి కదిరి పట్టణ మాజీ అధ్యక్షులు కె.ఎస్ బహుద్దీన్, మైనార్టీ నాయకులు బాబా ఫకృద్దీన్, అలంకార్ జాకీర్ తదితరులు ఉన్నారు.