ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఎంపీడీవో జయ మాధవి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులపై చర్చించారు. ముందుగా వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఎంపీపీ రాజేశ్వరి మాట్లాడుతూ, మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి జరిగే ఈ సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడం తగదన్నారు. సమావేశానికి రాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోకు సూచించారు. పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ రమణ, జడ్పిటిసి సుకల రవణమ్మ, వైస్ ఎంపీపీ ఇన్నమ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.










