Feb 16,2023 22:47

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 18, 19 తేదీలలో దుర్గగుడికి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులు రానున్న దృష్ట్యా శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఏర్పాట్లను ఆలయ ఇఒ భ్రమరాంబ, చైర్మన్‌ కర్నాటి రాంబాబు గురువారం పరిశీలించారు. క్యూలైన్‌, లైటింగ్‌, శానిటేషన్‌ తదితర పనులను పరిశీలించారు. ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు కే.వి.ఎస్‌ కోటేశ్వరరావు ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య, నంబూరి రవి, వైదిక కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీనివాస శాస్త్రి, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్‌.రమేష్‌, బి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.