ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన సాగర ్‌బాబు జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించి తమిళనాడు రాష్ట్రం పాండిచ్చేరి క్యాడర్‌లో ఐఆర్ ఎస్‌గా పోస్టింగ్ పొందడం హర్షణీ యమని స్థానిక విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద శేఖర్ అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రియ దర్శిని కళాశా లలో సివిల్స్‌లో విజ యం సాధించిన యాళ్ల సాగర్‌బా బును శాలువ, పూల దండలతో బుధ వారం ఘనంగా సత్కరించారు. ఈ సంద ర్భంగా డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ మాటా డుతూ దళిత గిరిజన సంఘాల జెఎసి ఆధ ్వర్యంలో యాళ్ల సాగర్‌బాబుకు భారీ సన్మాన సభ జరిగింద న్నారు. ఐఆర్‌ఎస్ విజేత సాగర్‌బాబు మాట్లాడుతూ సాధారణమైన గ్రామీణ ప్రాంత విద్య సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన తాను మూడో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్ సాధించానని తెలిపారు. తన తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మరణిం చారన్నారు. తాను పట్టుదలతో కష్టపడి తన మూడో ప్రయత్నంలో ఐఆర్ ఎస్ సాధించినట్లు చెప్పారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు తన విజయానికి పునాదులు వేశాయన్నా రు. తన విజయం వెనుక తన సోదరుడు, బంధువులు, మిత్రులు, గురువుల పాత్ర ఎంతో ఉందని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారిని అయిన అనంతరం ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉన్న మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానుకొండ కిషోర్, నాటకశాల వెంకటరాజు, ప్రముఖ న్యాయవాది రాంబాబు, కోడేటి సత్యనారాయణ, సత్యానందం, రమేష్, సత్యనారాయణ దీపక్ పాల్గొన్నారు.










