
మాచర్ల: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మాచర్ల ఎస్వీఆర్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ శాస్త్రజ్ఞులు సివి రామన్, మేడం క్యూరీ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్.వి.ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు వై.వెంకట్రామయ్య అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లా డుతూ జన విజ్ఞాన వేదిక ఆశయాలను వివరించారు. సివి రామన్, మేడం క్యూరీల జీవి తాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి విద్యార్థినీ, విద్యార్థులు చేరుకోవాలని కోరారు. మరో గౌరవాధ్యక్షులు, సీనియర్ లెక్చరర్ కేలం ఆదినారాయణ మాట్లా డుతూ రామన్ పరిశోధించిన ఎఫెక్ట్ గురించి దాని అనువర్తనాలను వివరించారు. రామన్ పరి శోధన కారణంగా రసాయనిక పదా ర్థాలలో అణువుల నిర్మాణాలను వివరించటానికి ఉపయోగ పడతాయని అన్నారు. కళాశాల డైరెక్టర్, జన విజ్ఞాన వేదిక సభ్యులు బీమా వేణుగోపాలరావు మాట్లా డుతూ పరమాణు భౌతిక శాస్త్రము, రేడియో ధార్మికత, రేడియో థెెరఫీ లాంటి వాటికి మేడం క్యూరీ ఆద్యురాలని అన్నారు. కళాశాల విద్యార్థి ఎర్రం శెట్టి శశి శంకర మాట్లాడుతూ మూఢనమ్మ కాలను పారదోలడానికి విజ్ఞాన వేదిక కృషి చేయాలని చెప్పారు