Nov 11,2023 19:01

ప్రజాశక్తి - పాలకొల్లు
            శివదేవుని చిక్కాల శ్రీరాఘవేంద్ర ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారి సహకారంతో కంప్యూటర్‌ శిక్షణ, లైట్‌ మోటర్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ ఉచితంగా నేర్పించనున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ నిమ్మల రామారావు చెప్పారు. శనివారం ఆయన పాలకొల్లులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అర్హులైన అభ్యర్థులకు ఆర్‌టిఒ ద్వారా ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించనున్నట్లు చెప్పారు. పైన పేర్కొన్న కోర్సుల్లో పూర్తిగా అర్హత, లైసెన్స్‌ పొందినవారికి ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి కింద అవకాశాలు ట్రస్ట్‌ ద్వారా కల్పించనున్నట్లు చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెలాఖరులోగా శివప్రసాద్‌ 7416099599 సంప్రదించాలని కోరారు. కంప్యూటర్‌ శిక్షణకు ఇంటర్‌ ఉత్తీర్ణత కలిగి 18 ఏళ్లు పైబడినవారు అర్హులన్నారు. కార్‌ డ్రైవింగ్‌ శిక్షణ పదో తరగతి ఉత్తీర్ణత కలిగి 20 సంవత్సరాలు పైబడినవారు అర్హులన్నారు.