నీటిని విడుదల చేస్తున్న ఎస్‌ఇ సుధాకర్
- నీటిపారుదలశాఖ ఎస్‌ఇ సుధాకర్
ప్రజాశక్తి- బూర్జ: మండలంలోని నారాయణపురం ఆనకట్ట ద్వారా నాగావళి నది నుంచి శివారు భూముల వరకూ సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ ఎస్‌ఇ సుధాకర్ రైతులకు హామీనిచ్చారు. మండలంలోని నారాయణపురం కుడి, ఎడమ కాలువల ద్వారా 400 క్యూసెక్కుల సాగునీటిని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిఇ మురళీమోహన్, ఎఇలు శ్రీనివాసరావు, రాంబాబు, రవికుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.










