
ప్రజాశక్తి- అరకులోయ రూరల్:మండంలోని చొంపి వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెన మార్గం నుంచి చొంపి, శిరాగం, బస్కి, మాడగడ, హుకుంపేట మండలం బూర్జ, వేంగడ పంచాయతీ గ్రామాల గిరిజనులు తరుచుగా అరకులోయ మండల కేంద్రంలో పనులు నిమిత్తం రాకపోకలు చేస్తుంటారు. ఈ వంతెన సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించారు.ఈ వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. వంతెనకు ఇరువైపులా ఉన్న ప్రహరీ రక్షణ వలయాలు కూడా విరిగి కూలి పోయాయి. దీంతో, అతి ప్రమాదకరంగా మారింది. ఈ వంతెనపై నుంచి టిప్పర్, లారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ మధ్యకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మరింత ప్రమధకరంగా మారింది. గతంలో నిధులు మంజూరు చేసి మంజూరు చేసి నూతన వంతెన నిర్మించాలని పలు మార్లు అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వంతెన నిర్మించాలని వాబోతున్నారు.