Aug 09,2023 21:08

శిథిలావస్థలో వెలిగల్లు భవనం

భయం గుప్పిట రెగ్యులర్‌ సందర్శకులు
ఇరిగేషన్‌ ఉద్యోగుల్లో ఆందోళన
నిద్రావస్థలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు
కడప ప్రతినిధి : వెలిగల్లు నీటి పారుదల శాఖ కార్యాలయం శిథి లావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌ రెగ్యులర్‌ డివిజన్‌ ఆవరణంలో వెలిగల్లు ఇంజినీరింగ్‌ కార్యాలయం ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం కార్యకలాపాలు సాగించేది. వర్షాకాలంలో ఉరుస్తోందనే కారణంతో వెలిగల్లు ఇంజినీరింగ్‌ యంత్రాంగం అతిథిగృహాన్ని ఆశ్రయించింది. అనంతరం ఇంజినీరింగ్‌ యంత్రాంగం భవన మర మ్మతులను గాలికి వదిలేసింది. ఫలితంగా పాడుబడి శిథిలా వస్థకు చేరుకుంది. ప్రతి ఏటా కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరి ప్రాణాలు తీద్దామా అని ఎదురు చూస్తోంది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో వెలిగల్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిద్రావస్థలో జోగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
1989లో రూ.కోట్ల వ్యయంతో వెలిగల్లు ఇంజి నీరింగ్‌ కార్యాలయం నిర్మితమైంది. దీనికి అతి సమీపంలో ఇరిగేషన్‌ రెగ్యులర్‌ కార్యాలయ ఆవరణంలో ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం, ఇరిగేషన్‌ డిప్యూటీ ఇంజినీరింగ్‌ కార్యాలయం, ప్రపంచ బ్యాంకు నిధుల సహాయంతో చెరువుల అభివృద్ధి కార్యాలయం, అన్నమయ్య ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం సహా పలువురు ఎఇలు, డిఇల కార్యాలయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ ఇరిగేషన్‌ రెగ్యులర్‌ కార్యాలయ సందర్శకులు ఇంజినీర్ల అపా యింట్‌మెంట్ల కోసం పదుల సం ఖ్యలో సందర్శకులు వస్తుంటారు. శిథిలావస్థకు చేరిన వెలిగల్లు భవన సముదాయాన్ని ఆనుకుని వాహనాలు నిలు పుకోవడం, ఇంజినీర్ల అపా యింట్‌మెంట్‌ కోసం నిలుచుకో వడం పరిపాటి. అటువంటి సమయంలో శిథిలావస్థకు చేరు కున్న వెలిగల్లు ఇంజినీర్‌ కార్యాలయం కూలితే పదుల సం ఖ్యలో సందర్శకులు ప్రాణాలను, వాహ నాలను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. రెండ్రోజుల కిందట వీచిన గాలికి చెట్టుకు ఉన్న పెద్దకొమ్మ విరిగిపడిన సంఘటన చోటు చేసుకుంది. గాలివీచే సమయంలో చెట్టు కింద గానీ, శిథిలా వస్థ దశలో ఉన్న వెలిగల్లు ఇంజినీరింగ్‌ కా ర్యాలయ భవనం కింద గానీ సందర్శకులు లేకపోవడం ఉప శమనం కలిగి ంచింది. ఇటు వంటి ప్రమాదకర పరిస్థి తులు కళ్లెదుట కనిప ిస్తున్నప్పటికీ వెలిగల్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సదరు భవ నానికి మరమ్మతులు చేయడమా, కూల్చే యడమా అనే అంశాన్ని మరిచి మొద్దునిద్రను నటిం చడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీనిపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజి నీర్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.