Jun 12,2023 00:43

పెచ్చులూడిన స్లాబ్‌

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని వెల్లలచెరువు హిందూ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలకు చేరింది. స్లాబ్‌ పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ పాఠశాల 1942లో ప్రారంభించారు. ఎనిమిది గదులున్న ఈ పాఠశాల ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షం వస్తే గదులన్నీ జలమయమే, ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల గోడలు కూడా బీటలు వారాయి. దీంతో ఎప్పుడు కూలుతుందోనని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక శిథిలమైన గదులలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివద్ధి కోసం ప్రవేశ పెట్టిన నాడు-నేడు పథకంలో ఈ పాఠశాలను చేర్చేందుకు అధికారులు దష్టి సారించలేదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల ప్రశ్నిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాల పంపాలా వద్దా అని విద్యార్థుల తల్లిదండ్రులు మదన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించాలని వారు తెలిపారు.