Oct 17,2022 23:45

కారిపోతున్న పాఠశాల భవనాన్ని పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు,

ప్రజాశక్తి-అడ్డతీగల
మండలంలో గోండోలు గ్రామంలో లూథరన్‌ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం స్లాబ్‌ పెచ్చులూడిపోయాయి. వర్షం వస్తే కారిపోతుంది. సరి సదుపాయాలు కూడా లేవు. దీంతో తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న పాఠశాలలను నాడు-నేడు నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలను ఏర్పాటు చేయాలని, లేదంటే ఎయిడెడ్‌ పాఠశాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా మార్చాలని, తద్వారా నూతన భవనాల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.