Aug 04,2022 22:28

ప్రొక్లయినర్‌ సాయంతో దుకాణాల తొలగింపు

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక మెయిన్‌ రోడ్డులో శిథిలావస్థకు చేరిన జివిఎంసి అధీనంలోని పలు దుకాణాలను ప్రొక్లయినర్‌ సాయంతో తొలగించారు. దుకాణాల్లో కొంత కాలంగా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులను ఆయా దుకాణాల నుంచి ఇటీవల జివిఎంసి అధికారులు ఖాళీ చేయించారు. వీటిని ఒక్కొక్కటిగా తొలగించే ప్రక్రియ గురు వారం ప్రారంభమైంది. దుకాణాల తొలగింపును మూడో వార్డు కార్పొరేటర్‌ గంటా అప్పల కొండ పరిశీలించారు. వీటిని తొలగించిన తర్వాత కొత్తగా నిర్మాణాలు చేపట్టి నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావును కోరారు.