ప్రజాశక్తి -ఆనందపురం :మండలంలోని లోడగలవానిపాలెం పంచాయతీ ఈగలవానిపాలెం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. భవనం పెచ్చులూడి పడిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. విషయాన్ని స్థానిక సర్పంచ్ లోడగల రాజేశ్వరిరమణ, ఉపసర్పంచ్ నాగరాజు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సోమవారం ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక, మజ్జి వెంకటరావు, ఎంపిడిఒ లవరాజు, అధికార బృందం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న పిల్లలను తాత్కాలికంగా పక్కన ఉన్న వంటశాలలోకి మార్పు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల భవనాన్ని వీలైనంత త్వరగా పడగొట్టి కొత్త బిల్డింగ్ ఏర్పాటుకు ఎస్టిమేషన్ ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల భవనం మంజూరుకు సహకరించిన అధికారులను మాజీ సర్పంచ్ లోడగల రమణ, ఉపసర్పంచ్ ఈగల నాగరాజు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్ లక్ష్మణ్‌కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ వినోద్, ప్రధానోపాధ్యాయులు బాబూరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










