Nov 03,2023 20:40

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఛాన్సలర్‌ మదన్‌లాల్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఇటీవల మొట్టమొదటి ఛాన్సలర్‌ గా నియమితులైన విశ్రాంత ఐఎఎస్‌ మదన్‌ లాల్‌ మీనా శుక్రవారం స్థానిక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రస్తుత వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తేజస్వి కట్టిమని ఆయనకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతించారు. తొలుత యూనివర్సిటీ ఆవరణ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అనంతరం వివిధ విభాగాలు, ప్రయోగశాలలు సందర్శించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ విశ్వవిద్యాలయ గురించి ఛాన్సలర్‌ కు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం బోధనా సిబ్బందితో మాట్లాడి భోదన, పరిశోధన, పరిపాలనా పరమైన వివిధ అంశాలను అడిగి తెలుకున్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యాప్రగతి, విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీన్లు ప్రొఫెసర్‌ శరత్‌ చంద్ర బాబు, జితేంద్ర మొంహన మిశ్ర, కంట్రోలర్‌ అఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రొఫెసర్‌ కివాడే, వివిధ విభాగ అధిపతులు పాల్గొన్నారు.