మందులు పరిశీలిస్తున్న జమల్ భాషా
ప్రజాశక్తి - పెదబయలు:గోమంగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జమల్ భాషా సందర్శించారు. పిహెచ్‌సీ పరిధిలో ఉన్న గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. శిశు మరణాలు రేటును తగ్గించి సుఖ ప్రసవాలకు చర్యలు తీసుకోవాలన్నారు. పిహెచ్‌సి సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పర్యటనలకు వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిష్టర్‌లో సంతకం చేయాలని సూచించారు. మినీ గురుకులాన్ని సందర్శించారు, పౌష్ఠిక ఆహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయన వెంట అదనపు జిల్లా వైద్యాధికారి కె.లీలాప్రసాద్, ఎపిడెమిక్ సెల్ ఆరోగ్య విస్తరణ అధికారి గుల్లేలి సింహాద్రి, వైద్యులు కిరణ్ ఉన్నారు.










