ఆకులు వాల్చిన చెట్టు ఆకులు రాలిన చెట్టు
అలసిన దేహం ఒకటే .
కొద్ది కొద్దిగా వికసించిన ఆకులు
ముద్ద ముద్దగా తడుస్తూ
గాలులు విసురుతూ ప్రాణాల్ని నిలుపుతూ
అందమైన జీవితం గడిపాక
ఒక రోజు విశ్రమించక తప్పదు .
కొన్ని ఆలోచనలు దొర్లుతూ
సంఘర్షణల మధ్య గడుపుతూ
కర్తవ్యం నడిచాక శరీరం వాలిపోతుంది .
నిస్సత్తువు ఆవహించినపుడు
చూపులు సంధ్య వైపు ప్రవహిస్తుంటాయి .
ఊపిరి వెలుగుతున్న కాలమంతా
రుతువులు రువ్వుతునేవుంటాయి .
ఈ కొంత కాలంలో
కొన్ని అనుభూతుల్ని
ముద్రించుకోవటంలో
శిశిరకాలం వసంతకాలం
తలమునకలౌతుంటాయి .
-గవిడి శ్రీనివాస్ 9966550601