Jun 15,2023 00:34

సిసి రోడ్డు, డ్రెయినేజీకి శంకుస్థాపన చేస్తున్న కామేశ్వరి, కెకె.రాజు

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 47వ వార్డు పరిధి బాపూజీనగర్‌, అంబేద్కర్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మెట్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వార్డు కార్పొరేటర్‌ కంటిపాము కామేశ్వరి సమక్షంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు బుధవారం అంబేద్కర్‌ ఎస్టేట్‌ వినాయకుడి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ప్రజల సమస్యలను గుర్తించి సిసి రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కె.వెంగళరావు, 47వ వార్డు నాయకులు వసంతల అప్పారావు, సుకుమార్‌, గురువోజి, కె.చిన్నా, రాఘవులు, కృపా, భోగి, ముక్క రమణ, సురేష్‌, అనీల్‌, చందురెడ్డి, జయకుమార్‌, కనకరాజు, రమేష్‌, ఎఇ అర్చన, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.