ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని కడగండి పంచాయతీ పెద్దవంగర నుంచి పెద్దవంగరగూడ గ్రామానికి రూ.60 లక్షల అంచన విలువతో నిర్మించబోవు సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే వి.కళావతి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కరించడం జరుగుతుందని, అందులో భాగంగానే ప్రజల విజ్ఞప్తి మేరకు తమ దృష్టికి వచ్చిన రోడ్డు సమస్యల కోసం పాలకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70 ప్రధాన రోడ్లు అనుసంధానం చేయడం జరిగింది తెలిపారు. ప్రస్తుతం వచ్చిన నిధుల్లో రూ.6కోట్ల 20 లక్షల కేటాయిస్తామని, దీనిద్వారా మరికొన్ని రోడ్ల సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే 2 నెలల్లో మిగిలిన అన్ని రోడ్లకు అనుమతులు లభిస్తాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న గడపగడపకు కార్యక్రమం ద్వారా మీ ఇళ్లకు రావడం జరుగుతుందని తద్వారా అందరి సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ప్రతినిధి సవర రాము, స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










