Oct 12,2023 16:27

సిసి రోడ్లను ప్రారంభించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

సిసి రోడ్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి.
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

     నంద్యాల పట్టణంతోపాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నంద్యాలలో ఎన్నడూ లేని విదంగా పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3 వార్డు నందు 20 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్లను  మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ని  సా,కౌన్సిలర్ సమ్మద్ లతో కలిసి ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని మూడో వార్డు ఓల్డ్ టౌన్ నందు 20 లక్షల రూపాయలతో రెండు నూతన రెండు సిసి రోడ్లను నేడు ప్రారంభించడం జరిగిందని ఎంతోకాలంగా ప్రజలు రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ప్రజలు  ఎక్కువగా ఉన్న ప్రాంతం అలాగే అక్కడ ఇరుకుగా ఉండడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోయారని వారికి ప్రజలందరూ సహకరించడం తో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యను నెరవేర్చడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం ఏదైతే మంచికార్యక్రమం మొదలుపెట్టారో ఆ కార్యక్రమం ద్వారా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఓల్డ్ టౌన్ లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, నంద్యాల పట్టణ అధ్యక్షులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, జాకీర్ హుస్సేన్ వైసీపీ కౌన్సిలర్ కలాం భాష, ఆరిఫ్ నాయక్ ,తబ్రీజ్, శాదిక్ భాష , కోఆప్షన్ సభ్యులు సలాం ముల్ల ,వైసిపి నాయకులు గోపాల్, దండే సుధాకర్, దండ శ్రీను, అమీర్, వార్డు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.