Oct 02,2023 00:35

సమావేశంలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సీతారామయ్య, నాయకులు

ప్రజాశక్తి-కూనవరం
మండలంలో సిసి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని టేకులబోరు గ్రామంలో సిపిఎం నాయకులు ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన గ్రామశాఖ సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అణగారిన వర్గాల ప్రజలు నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. రోడ్లు, మంచినీరు, విద్యుత్‌ లైట్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. తక్షణమే గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని కోరారు. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు శ్యామల కృష్ణ, తాళ్లూరి శ్రీనివాసరావు, వెంకన్నబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.