Jul 18,2023 17:07

పనులను ప్రారంభిస్తున్న జెడ్పిటిసి బోరెడ్డి శ్రీరామారెడ్డి

సిసి రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

ప్రజాశక్తి -ప్యాపిలి

పట్టణంలోని చెన్నకేశవ దేవాలయం దగ్గర 3వ వార్డు నందు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మిదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ బోరెడ్డి రాము, కృష్ణారెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సంద్బంగా వారు మాట్లాడుతూ మండల నిధుల నుంచి గతంలో ఇచ్చిన హామీలలో భాగంగా రోడ్లు వేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌ రెడ్డి, నిజాముద్దీన్‌, శ్రీనివాసులు, పెద్దిరాజు పాల్గొన్నారు.