
ప్రజాశక్తి -సైదాపురం :మండల కేంద్రమైన సైదాపురంలో పలు వీధులలో సిమెంట్ రోడ్ల పనులు ప్రారం భమయ్యాయి. వైసిపి వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి చొరవతో సైదాపురం పంచాయితీ పరిధిలోని రాపూరు క్రాస్ రోడ్డు వద్దనున్న ఎస్‌టి కాలనీ, గ్రామంలోని, ప్రధాన వీధులు, పముఖ పుణ్యక్షేత్రమైన సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం వద్ద నుంచి కొంత దూరం వరకు సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. రూ. 17 లక్షలతో సైదాపురం పంచాయతిలో మంజూరైన ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభ మయ్యాయి. పంచాయితీ రాజ్ ఎఇ వీరమణి మాట్లాడుతూ సైదాపురం పంచాయతీలోని సచివాలయం పరిధిలో 17 లక్షల ఖర్చుతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆయన సూచించారు. నాసిరకంగా నిర్మిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.