Nov 24,2022 22:39

ప్రజాశక్తి-నందిగామ
నందిగామ పట్టణంలోని 13,14 వార్డులలో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు నందిగామ శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు గురువారం శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో గడపగడపకు విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నారని ఆ నిధులతో ప్రజలకు అవసరమైన అభివద్ధి పనులు చేపడు తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ డాక్టర్‌ జయరాం , కౌన్సిల్‌ సభ్యులు గద్దె శేషు కుమారి, నాదెండ్ల నరేంద్ర , గద్దె రమేష్‌ , నరసింహారావు, మారం అమరయ్య , షేక్‌ ఖాలిక్‌, పాకాలపాటి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు .