Mar 21,2023 23:50

బ్యాంకు మేనేజర్‌కు నోటీస్‌ అందజేస్తున్న ఎస్‌ఐ శిరీష

ప్రజాశక్తి-నక్కపల్లి:జిల్లాలోని వివిధ మండలాల్లో మారుమూల బ్యాంకులు, ఏటీఎంల్లో దొంగలు డబ్బును దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్‌ఐ శిరీష తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు. మండలంలో బ్యాంకు మేనేజర్లకు మంగళవారం నోటీసులను అందజేశారు. ఈ మధ్య కాలంలో జరిగిన దొంగతనాలను మేనేజర్ల దృష్టికి తీసుకువెళ్లారు.