సిసి డ్రెయిన్లకు శంకుస్థాపన చేస్తున్న కెకె.రాజు తదితరులు
ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 42వ వార్డు పరిధి రైల్వే న్యూకాలనీలో శ్రీశ్రీశ్రీ పరదేశమ్మ ఆలయం ఎదురు వీధిలో రూ.20 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి కార్పొరేటర్ ఆళ్ల లీలావతిశ్రీనివాసరావు ఆధ్వర్యాన నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ముందుగా పరదేశమ్మ అమ్మవారు ఆలయానికి కెకె.రాజు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 42వార్డు వైసిపి అధ్యక్షులు షేఖ్ జుబేర్, నాయకులు ప్రసాద్, నాగమణి, డిఇ భరణి, గాలి ప్రసాద్, యడ్ల శ్రీనివాసరెడ్డి, గౌరీ, కృష్ణవేణి, షాజ్‌హాన్, మాధవ్, గణేష్, నూకరాజు, రమణమూర్తి, శ్రీనివాసరెడ్డి, వెంకటరావు, జగన్ తదితరులు పాల్గొన్నారు.










