
ప్రజాశక్తి - బాపట్ల
ప్రధమ మున్సిపల్ చైర్మన్‌గా పట్టణ అభివృద్ధికి పటిష్టమైన పునాదులు వేసిన బాపట్ల తొలి మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు స్మరణీయులని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయి బాబు అన్నారు. వెలగపూడి సుబ్బారావు 66వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని చంద్రకళ పార్కులోని వెలగపూడి విగ్రహానికి పూలమాలవేసి బుధవారం నివాళులర్పించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు వెలగపూడి విశేష కృషి చేశారని అన్నారు. సుప్రసిద్ధ న్యాయవాదిగా, వితరణశీలిగా ఖ్యాతికెక్కారని అన్నారు. సరస్వతి స్మారక పాఠశాల, అర్బన్ బ్యాంక్, ఎవివి ఉన్నత పాఠశాల, రోటరీ క్లబ్ వంటి సంస్థలకు వ్యవస్థాపకులుగా సేవలందించారని అన్నారు. ఆయన త్యాగం నిరుపమానమైనదని అన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏవివి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.