శిరివెళ్లలో అభివృద్ధి శూన్యం : మాజీ మంత్రి
ప్రజాశక్తి - శిరివెళ్ళ
శిరివెళ్ల మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలు చేసిందేమీ లేదని, అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. శుక్రవారం శిరివెళ్లలోని 15, 16వ వార్డులలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని టిడిపి మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిరివెళ్లలో డ్రెయినేజీ, పారిశుధ్య పనులు చేయలేని గత్యంతర స్థితిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని, ప్రజలు ఎదురుగా వచ్చి సమస్యలు వివరిస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించలేని అధికార పార్టీ నాయకులకు పదవులు ఎందుకని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే సమయం తొందర్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు యామా గుర్రప్ప, మోహన్ రెడ్డి, కోటపాడు మాజీ సర్పంచి కాల్లూరి శకుంతలమ్మ, గేట్ షేక్షా, షేక్ మునాఫ్, లింగమయ్య నంద్యాల అబూబకర్ సిద్ధిక్ బి, ఎండి రఫీ, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.










