ప్రజాశక్తి - వేటపాలెం
మండలంలోని కొత్తపేట పంచాయితీ 216జాతీయ రహదారి రామాపురం జంక్షన్ వద్ద సిరివెన్నెల ఫుడ్ కోర్టును ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారపదార్దాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కట్టా చంద్ర, గుంటూరు మాధవరావు పాల్గొన్నారు.










