ప్రజాశక్తి- అడ్డతీగల
సిరామిక్ పాట్ ఫిల్టర్ తయారీ, దానిని వాడే పద్ధతులపై లయ సంస్థ ఆధ్వర్యాన 20 మంది ఆదివాసీ యువతకు ఆ సంస్థ శిక్షణా కేంద్రంలో ఈ నెల 2 నుండి 7వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి సునీల్, సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధి లలిత్ శర్మ మాట్లాడుతూ రెండో విడత శిక్షణ ఈ నెల చివరిలో ఒక వారం రోజులు పాటు ఉంటుందని చెప్పారు. రెండో దశ శిక్షణ అనంతరం ఈ సిరామిక్ పాట్ ఫిల్టర్ తయారు చేసి అర్హులైన ఆదివాసీ ప్రజలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఫిల్టర్ ఖరీదు రూ.600 ఉంటుందని, ఇది మూడు సంవత్సరాల వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా పనిచేస్తుందని పేర్కొన్నారు.










