
సిపికి వినతిపత్రం ఇస్తున్న లారీ ఓనర్స్
విజయవాడ : దేశం నలు మూలల నుంచి విజయవాడ వచ్చే రవాణా వాహ నాలు విజయవాడ నగరం నుండి పగటి వేళల్లో బయ టకు వెళ్ళకుండా విధించిన ట్రాఫిక్ ఆంక్షలు సడలించాలని, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్, వై.వి.రావు ఎస్టేట్, చనుమోలు వెంకట్రావు ఫైఓవర్, ఐరన్ యార్డు మీదుగా గొల్లపూడి నుండి గూడ్స్ వాహనాలు బయటకు వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటాను బుధవారం కలిసి కష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి, ప్రధానకార్యదర్శి గోపిశెట్టి వీరవెంకయ్య, కార్యదర్శులు ఆళ్ల వెంకటేశ్వరరావు, వత్సవాయి కష్ణంరాజు, విజయవాడ ట్రైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సురేష్, సభ్యులు వినతిపత్రం సమర్పించారు.