Sep 10,2023 19:38

సమావేశంలో మాట్లాడుతున్న కిలారి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు డివిజన్‌ ఐదు మండలాల యుటిఎఫ్‌ కార్యవర్గ సమావేశం దాచూరి రామిరెడ్డి విజ్ఞాన్‌ భవన్‌లో జిల్లా కార్యదర్శి పి.మురళీ కష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగినది. ముఖ్య అతిథిగా జిల్లా గౌరవాధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. విద్యారంగ పరిణామాలు,. జిఒ నెంబర్‌ నెం117 రద్దుచేయాలని, యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ ను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో కందుకూరు ప్రధానకార్యదర్శి పొన్నగంటి వెంకటేశ్వర్లు, వి.వి.పాలెం అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు మన్నం మాధవ రావు ,సిహెచ్‌ శ్రీనివాసులు,ఉలవపాడు అధ్యక్ష, ప్రధానకార్యదర్సులు నాగేంద్రరావు, జాలయ్య, సీనియర్‌ నాయకులు ముప్పరాజు కోటేశ్వర రావు, రమణయ్య, పవని రమేష్‌ బాబు,ఎం.శ్రీనివాసులు, జి.సతీష్‌ బాబు,మోడల్‌ స్కూల్‌ రాష్ట్ర నాయకులు బోసుబాబు గారు పొన్నలూరు, గుడ్లూరు, లింగసముద్రం కార్యకర్తలు పాల్గొన్నారు.