యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌కుమార్
ప్రజాశక్తి-నందిగామ
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నందిగామ యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం యు టి ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ కె.శ్రీనివాసరావు, ఏ సుందరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజులలో రద్దు చేస్తానన్న సిపిఎస్ మూడున్నర సంవత్సరాలైనా గాని రద్దు చేయకపోగా జి.పి.ఎస్ స్కీం ప్రవేశ పెట్టడాన్ని తప్పుపట్టారు. మేనిఫెస్టో హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ లు విడుదల, మరియు పెండింగ్ లో పి. ఎఫ్, ఏ పీజీ. ఎల్. ఐ ,ఈ .యల్ బకాయిలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ మూడు, నాలుగు , ఐదు తరగతిల విలీనాన్ని సంబంధించిన 117 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 22న నందిగామ లో జరుగు యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లాకౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వర్ రావు కోరారు.ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు మచ్చా శ్రీనివాస్ , జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. కష్ణయ్య, జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శిలు పులి శ్రీనివాసరావు, కే గంగరాజు ,బి సూర్యనారాయణ పి. భవాని,రత్న కమల్ బాబు , రెడ్ స్టార్ పాల్గొన్నారు .










