Jul 26,2022 00:44

ధర్నాలో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని ఎపిటిఎఫ్‌ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి ఎన్‌.విజయశ్రీ డిమాండ్‌ చేశారు. జీవో 117, 128లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎపిటిఎఫ్‌ చేపట్టిన ధర్నా రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కొఠాన శ్రీనివాస్‌ మాట్లాడుతూ 117 జిఒ వల్ల ప్రాథమిక విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామకృష్ణారావు, విశాఖ అర్బన్‌ కార్యదర్శి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.