ప్రజాశక్తి - ఆస్పరి
సిపిఎస్ రద్దు కోసం యుటిఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపడుతున్నామని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి దేవపాల్ తెలిపారు. గురువారం మండలంలోని ములుగుందం, బనవనూర్, కారుమంచి, కైరుప్పల, పుప్పాలదొడ్డి, బిల్లేకల్ గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో జిల్లా కార్యదర్శి దేవపాల్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ స్థానంలో ఒపిఎస్‌ను ప్రవేశ పెడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిపిఎస్‌ను రద్దు చేస్తానన్న హామీని మరిచి జిపిఎస్‌ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరారు. మండల ప్రధాన కార్యదర్శి బాబు, ఆదెప్ప, మోదీన్ బాష, ఖలీల్, రంగన్న, అనిల్ కుమార్, రాఘవేంద్ర పాల్గొన్నారు.
పోస్టు కార్డు ఉద్యమం చేపడుతున్న నాయకులు










