ప్రజాశక్తి - ఏలూరు
ఉపాధ్యాయుల, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని, సిపిఎస్ రద్దుచేసి ఒపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శుక్రవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు చేతికి సంకెళ్లు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం ధర్నా నిర్వహిం చారు. సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పళ్లెం కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నానుద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు (యువి), సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.లింగరాజు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న ఉపాధ్యాయుల పై, ఉద్యోగులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని విమర్శిం చారు. రకరకాల యాప్‌ల పేరుతో ఉపాధ్యా యులపై ఒత్తిడి చేస్తోందన్నారు. బైజూస్ సంస్థకు సేవ చేయాలని ఉపాధ్యా యులపై ఒత్తిడి సరికాదన్నారు. ఈ ఒత్తిడి వల్ల ఇటీవల రాష్ట్రంలో ఐదుగురు ఉపాధ్యాయులు మృతిచెందారని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ఓటు వేసుకునే హక్కు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉందని ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై నిర్బంధ విధానాలు వీడాలని హెచ్చరించారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె.శ్రీనివాస్, పివి.రామకృష్ణ, ఇతర నాయకులు కె.విజయలక్ష్మి, పి.ఆదిశేషు, సాయిబాబు, జగన్నాథరావు సిపిఐ నాయకులు ఉప్పులూరు హేమశంకర్, పి.కన్నబాబు, మాఊరి విజయ, తెర్ల శ్రీను, ప్రసాద్, ఎమ్‌డి హకీమ్, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు నూకరాజు, మంగం అప్పారావు నాగేశ్వరరావు, దుర్గారావు పాల్గొన్నారు.










