
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ఏలూరులోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ప్రారంభమ య్యాయి. ఎంఎల్‌సి షేక్ సాబ్జీ ఈ దీక్షలను ప్రారంభించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు శిబిరానికి అధ్యక్షత వహించారు. జెఎసి ఛైర్మన్ చోడగిరి శ్రీనివాస్, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ నాయకులు ఎ.సత్యనారాయణ, వివిధ ప్రజాసంఘాల నాయకులు రవి, ఆర్‌టిసి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.సుంద రయ్య, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, నాయకులు పి.కిషోర్, బి.సోమయ్య దీక్షలకు సంఘీభావం తెలిపారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా కార్యదర్శి పి.విద్యాసాగర్ బాబు, నాయకులు ఎ.విక్టర్, సిహెచ్.శ్రీధర్, కె.కమల్ కుమార్, బి.మోహన్ రావు, మరీదు లక్ష్మణరావు, వి.రాంబాబు, కట్టా శ్రీనివాస్, ఐ.దుర్గాప్రసాద్, జి.రామారావు తొలిరోజు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయా ల్సిందిపోయి జిపిఎస్ అనే ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయడం వల్ల లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతు న్నారన్నారు. జెఎసి చైర్మన్ చోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ యుటిఎఫ్ పోరాటానికి జెఎసి, ఎన్‌జిఒల తరపున పూర్తిమద్దతు తెలుపుతు న్నామన్నారు. తాముకూడా ఉద్యమంలోకి వస్తామని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 2004 సెప్టెంబరు ముందు నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరికీ పాత పెన్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి మాట్లాడుతూ ఒపిఎస్ సాధన పోరాటంలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.