మాట్లాడుతున్న సురేష్‌బాబు
ప్రజాశక్తి-బాపట్ల రూరల్ : సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పెన్షను అమలు చేయాలని ఎపి జెఎసి జిల్లా చైర్మన్ సిహెచ్. సురేష్‌బాబు కోరారు. ఎపి జెఎసి అమరావతి ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు సిపిఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గుర్రం మురళీమోహన్, జిల్లా కో చైర్మన్ వై. శ్రీనివాసరావు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ నరసారెడ్డి, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రామారావు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హను మంతరావు, ఎఐటియుసి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.










