ప్రజాశక్తి-తిరువూరు
సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేంత వరకు నిరంతర ఉద్యమాన్ని కొన సాగిస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ.మనోహర కుమార్, మాజీ కోశాధికారి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. యుటిఎఫ్ తిరువూరు మండల కౌన్సిల్ మహాసభ స్థానిక స త్య బిఈడి కళాశాలలో రాయల విన రు కుమార్ అధ్యక్షతన శనివారం రాత్రి జరిగింది. ప్రధానవక్తలుగా హాజరైన వారిరువురు మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానా న్ని తిరిగి అమలుచేస్తానని ఎన్నికల్లో పాదయాత్రలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారని, కానీ గద్దెనెక్కి తర్వాత దాన్ని అమలుచేయడం సా ధ్యపడదని చెప్పడం మోసపూరితమైన చర్య అని పేర్కొన్నారు. ఏడాదిగా ఉద్యోగుల సరెండర్ లీవ్, ఎపిజిఎల్‌ఐ బకాయిలు పెండింగ్ లో ఉన్నా ఈప్ర భుత్వం విడుదల చేయక పోవటంతో ఉద్యోగ, ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దష్టికి అనేక సార్లు తీసుకెళ్లి నా పెడచెవిన పెడు తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు డిఎల బకాయిలు వెంటనే విడు దల చేయాలని, ఉద్యోగుల ప్రమో షన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖాళీ ఉ న్న ఉపాధ్యాయులు పోస్టులను డిఎ స్సీ ద్వారా చేపట్టాలని యుటిఎఫ్ జి ల్లా ప్రధాన కార్యదర్శి అలవాల సుంద రయ్య, అధ్యక్షుడు కె.శ్రీనివాస్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.










