Oct 16,2023 00:37

కోటేశ్వరరావు, రవితేజ

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా మోపిదేవి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పెరవలి రవితేజ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఉబేదుల్లా బేక్‌, ప్రధాన కార్యదర్శిగా పోలూరి పిచ్చయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి, బాజీ పఠాన్‌, సుదర్శనం రత్తయ్య వ్యవహరించారు. పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒపిఎస్‌ పునరుద్ధరిస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎవరైతే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇస్తారో వారికే వచ్చే ఎన్నికల్లో సిపిఎస్‌ ఉద్యోగుల మద్దతు ఉంటుందని చెప్పారు. దానిపై భవిష్యత్‌ కార్యాచరణను చేపట్టబోతున్నట్లు తెలిపారు.