యడ్లపాడు: కార్పొరేట్ శక్తులతో కలిసి మతోన్మాదాన్ని పెంచి దేశ ప్రజలను అధో గతిలోకి తీసుకువెళుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టడానికి విశాల ప్రజా ఉద్యమం నిర్మించేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి వై.రాధాకృష్ణ అన్నారు. స్థానిక పిఆర్ విజ్ఞాన కే ంద్రంలో మంగళవారం సిపిఎం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రోశయ్య, టి.లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడారు. జులై 1,2 తేదీలలో యడ్లపాడులో జరిగే రాష్ట్ర స్థాయి ప్రాంతీయ శిక్షణా తర గతులను జయప్రదం చేయడానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది సభ్యులతో అధ్యక్షునిగా తోకల కోటేశ్వరరావు, కార్యదర్శిగా కె.రోశయ్య, కోశాధికారిగా జరుగుల శంకరరావుతో ఆహ్వాన సంఘం ఏర్పడింది.










