ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం, సీఐటీయు చేపట్టిన సంతకాలు సేకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. ఈ సందర్బంగా తోటపల్లిగూడూరు మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజాలు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ చేపట్టిన సమరభేరి కార్యక్రమం లో భాగంగా ప్రజల సమస్యలపై సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నిత్యవసర సరుకుల ధరలు అదుపు చేయాలన్నారు. అదేవిదంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు , పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించాలని వారు కోరారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని వెంకయ్య, రాజాలు డిమాండ్ చేశారు. సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు తోటపల్లిగూడూరు మండల కార్యాలయం వద్ద సమరభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వెంకయ్య, రాజాలు కోరారు. ప్రజా సమస్యలపై సేకరించిన సంతకాలను నరుకూరు సచివాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు భాష, రవి, వెంకటేష్, ఆలపాక సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.










