సచివాలయంలో విజ్ఞాపన పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-బాపట్ల: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం బాపట్ల పట్టణం ఉప్పరపాలెం శాఖ ఆధ్వర్యంలో గురువారం బాపట్ల పట్టణం 7వ వార్డులో కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ అనంతరం పట్టణంలోని 4వ సచివాల యంలో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 4 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా సిపిఎం సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఉప్పరపాలెం శాఖ కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, పార్టీ సీనియర్ నాయకులు వై భాస్కర రావు, పార్టీ నాయకులు రాజు, వెంకారెడ్డి, రంగారెడ్డి, పిట్టు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.










